Husband's Murder Case | కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

నిందితురాలితో పోలీసులు

•కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్  

•గోసంగీ కాలనీ ఘటనలో నిందితురాలు లక్ష్మి రైల్వే స్టేషన్‌లో పట్టివేత  

తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని గోసంగీ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.  

ఈ నెల 25న రాత్రి 10:00 గంటల సమయంలో కోదండం లక్ష్మి తన భర్త కోదండం శివాజీపై కొడవలితో మెడపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న కోదండం సూరి ఇచ్చిన ఫిర్యాదుతో కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రక్తపు నమూనాలు, ఇతర భౌతిక సాక్ష్యాలు సేకరించారు. విశ్వసనీయ సమాచారంతో ఏప్రిల్ 27న సోమవారం కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన కొడవలి, రక్తపు మరకలతో ఉన్న చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

*దర్యాప్తులో వెల్లడైన విషయాలు:*  

మృతుడు శివాజీకి మద్యం, జూదం అలవాట్లు ఉండేవి. కుటుంబ సమస్యలపై భార్యను తరచూ వేధించేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఏప్రిల్ 25న జరిగిన ఘర్షణలో ఆవేశానికి లోనైన లక్ష్మి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.  

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీనివాస్  పర్యవేక్షణలో పట్టణ ఇన్స్పెక్టర్ బి. నరహరి కేసును సమర్థవంతంగా విచారించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది.

Post a Comment

أحدث أقدم