NZB Student in London | లండన్ లా యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన గజాలా నస్రీన్

లండన్ లా యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన గజాలా నస్రీన్

నిజామాబాద్ అమ్మాయికి లండన్ లో ఘన సన్మానం

తల్లిదండ్రుల ఆశీస్సులతో ఘనత సాధించిన గజాలా

నిజామాబాద్, నవంబర్ 4: లండన్ లోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన నిజామాబాద్ కు చెందిన గజాలా నస్రీన్ ఖాద్రీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలోని ఖలీల్ వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మద్ ఇద్రీస్ ఖాద్రీ కుమార్తె గజాలా నస్రీన్. ఎల్లారెడ్డికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దివంగత మహమ్మద్ షరీఫ్ ఖాద్రీ మనవరాలు.

జీవదాన్ కాన్వెంట్ హైస్కూల్ లో పాఠశాల విద్య, జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, దిల్ సుఖ్ నగర్ లోని ప్రగతి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన గజాలా, ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి ఈ నెల 2వ తేదీన మాస్టర్స్ పట్టా అందుకున్నారు.

లండన్ లో జరిగిన పట్టా ప్రదానోత్సవంలో గజాలా తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, సొంత కృషితో ఈ ఘనత సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. Video 👇



Post a Comment

أحدث أقدم