Police Raid | అన్నాసాగర్ లో పేకాట స్థావరంపై ఎల్లారెడ్డి పోలీసుల దాడి

అన్నాసాగర్ లో పేకాట స్థావరంపై ఎల్లారెడ్డి పోలీసుల దాడి

రూ.24,600 నగదు, 6 మొబైల్స్, 4 బైక్ లు స్వాధీనం

పేకాట ఆడుతున్న 8 మంది అదుపులోకి, కేసు నమోదు

ఎల్లారెడ్డి, నవంబర్ 5: ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎల్లారెడ్డి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.

వారి వద్ద నుండి రూ.24,600 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదానికి బానిసై కుటుంబాలను రోడ్డున పడేయొద్దని, యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Post a Comment

أحدث أقدم