బాన్సువాడ ఎర్రమన్ను కుచ్చలో నాటు బాంబుల పేలుడు కలకలం
పందుల వేటకు తెచ్చిన బాంబులతో ఘోరం - ఏడుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి క్రిటికల్
బాన్సువాడలో యథేచ్ఛగా నాటు బాంబులు, జెలెటిన్ దందా - పోలీసుల నిఘా వైఫల్యమా?
బాన్సువాడ, నవంబర్ 1: బాన్సువాడ పట్టణం ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. పందుల వేట కోసం మోపెడ్‌పై తరలిస్తున్న నాటు బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు బాలికలు ఉన్నారు. గాయపడిన వారిలో వైశాలి(7), శ్రీదేవి (5) అంజలి (6),రాజు, లక్ష్మణ్, వెంకయ్య, రమేష్ లు ఉన్నారు.శ్రీదేవి, అంజలి, రమేష్ ల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రి కి హుటాహుటిన తరలించారు. కాంగ్రెస్ నాయకులు కాసుల రోహిత్, కౌన్సిలర్ ఖాళీక్ బాధితులకు అండగా నిలిచారు.
(వీడియో 👇)
అసలేం జరిగింది?ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసరి లక్ష్మయ్య తన మోపెడ్‌లో పొలం వద్దకు పందుల వేటకు నాటు బాంబులు తీసుకెళ్తున్నాడు. ఇంటి వద్దనే ఒక బాంబును నేలకేసి కొట్టే ప్రయత్నం చేయగా, అది పేలి పక్కనే ఉన్న మిగతా బాంబులు కూడా పేలాయి. ఈ ఘటనలో లక్ష్మయ్యతో పాటు అక్కడున్న మరో ఆరుగురు చెల్లాచెదురయ్యారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు:
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దాసరి లక్ష్మయ్య తన మోపెడ్‌లో పొలం వద్దకు పందుల వేటకు నాటు బాంబులు తయారు చేసుకుని తీసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో ఇంటి వద్దనే ఒక బాంబును నేలకేసి కొట్టే ప్రయత్నం చేయగా, అది పేలి పక్కనే ఉన్న మిగతా బాంబులు కూడా పేలాయి. ఈ ఘటనలో లక్ష్మయ్యతో పాటు అక్కడున్న మరో ఆరుగురు చెల్లాచెదురయ్యారు.
ఘటనా స్థలానికి బాన్సువాడ డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి సీఐలు తుల శ్రీధర్, తిరుపయ్య సిబ్బందితో కలిసి చేరుకుని పరిశీలించారు. విచారణలో స్థానికుల సమాచారం ప్రకారం బాన్సువాడ చుట్టుపక్కల గ్రామాల్లో అడవి పందులు, ఇతర అడవి జంతువులను వేటాడేందుకు విచ్చలవిడిగా నాటు బాంబులు వాడుతున్నట్లు తేలింది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి వచ్చి క్లూస్ సేకరిస్తోంది.
విచారణలో బాన్సువాడ చుట్టుపక్కల గ్రామాల్లో అడవి పందుల వేటకు రైతులు విచ్చలవిడిగా నాటు బాంబులు వాడుతున్నట్లు తేలింది. అంతేకాదు, పట్టణ శివారులోని గుట్టల్లో రాళ్లు పగలగొట్టే స్టోన్ క్రషర్ల నిర్వాహకులు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా భారీగా జెలెటిన్ స్టిక్స్, డెటోనేటర్లు నిల్వ ఉంచి వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడి నుంచే ఈ నాటు బాంబులు రైతులకు చేరుతున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.పోలీసుల నిర్లక్ష్యం, నిఘా లోపం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని, నాటు బాంబులకు అనుమతి ఎవరిచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.











إرسال تعليق