Muncipal Vice Chairperson Complaint |కౌన్సిల్‌కు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గోదావరి - కౌన్సిలర్లు

స్క్రాప్ అక్రమ విక్రయం, ఓపెన్ స్థలం కబ్జా, సీసీ కెమెరాలతో బెదిరింపులపై ఆరోపణలు

కౌన్సిల్‌కు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు - అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని వినతి

కామారెడ్డి, నవంబర్ 3: కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి అధ్యక్షతన కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిసి, అనంతరం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వై.ఎన్. గిరికి వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలోని ప్రధాన అంశాలు:

1. స్క్రాప్ అక్రమ విక్రయం: గత నెలలో గణపతి, దుర్గామాత నిమజ్జనాల తర్వాత ఏర్పడిన స్క్రాప్, విగ్రహాల స్టాండులు, ఇతర సామానును కౌన్సిల్‌కు తెలపకుండా అక్రమంగా విక్రయించారు.

2. మున్సిపల్ స్థలం కబ్జా: అశోక్ నగర్ కాలనీలో సర్వే నం. 218, 219, ఎల్.పి. నం. 135/1985 లో గల ఎకరా ఏడు గుంటల మున్సిపల్ ఓపెన్ స్థలంలో అక్రమంగా కబ్జా చేసి కొత్త నిర్మాణం చేపడుతున్నారు. ఇదే స్థలంలో గతంలో రెండు నిర్మాణాలు చేశారు. దీనికి అధికార కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారని, అక్రమ నిర్మాణాలను కూల్చి మున్సిపల్ ఆస్తిని కాపాడాలని కోరారు.

3. ఏకపక్ష నిర్ణయాలు: వార్డుల సమస్యలు పరిష్కరించకుండా, పండుగలకు సౌకర్యాలు కల్పించకుండా, కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

4. సీసీ కెమెరాలతో బెదిరింపులు: కమిషనర్ ఛాంబర్‌లోని సీసీ కెమెరాల వాయిస్ రికార్డును ఉపయోగించి కౌన్సిలర్లు మాట్లాడిన విషయాలపై బెదిరిస్తున్నారని, కెమెరాల యాక్సెస్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ వద్ద ఉందని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన ప్రూఫ్స్, గతంలో కౌన్సిలర్‌కు పంపిన మెసేజ్‌లను కలెక్టర్‌కు అందజేశారు.తక్షణమే మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు.

Post a Comment

أحدث أقدم