Telangana Jagruti | జాగృతి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

 


[ఫోటో: బాన్సువాడలో శ్రీ బేతాళ స్వామి జాతర సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న జాగృతి నాయకుడు మామిండ్ల రాజు]


బాన్సువాడలో శ్రీ బేతాళ స్వామి జాతర సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం


 తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ బేతాళ స్వామి జాతర సందర్భంగా గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. జాగృతి నాయకుడు మామిండ్ల రాజు చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు అధికమవడంతో భక్తులకు, ప్రజలకు చల్లని నీటిని అందజేయాలన్న ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ప్రజా సేవ కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ఆయన చెప్పారు.

చలివేంద్రం ద్వారా బేతాళ స్వామి జాతరకు వచ్చిన భక్తుల దాహార్తి తీరింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post