Thanks to CM | శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి ఇక రాష్ట్ర పండుగ

 

•శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి ఇక రాష్ట్ర పండుగ 

•తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

•సిఎంకు, షబ్బీర్ అలీకు కృతజ్ఞతలు

•డిసిసి ఉపాధక్షుడు గంప ప్రసాద్

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా "రాష్ట్ర పండుగ"గా ప్రకటించిందని, ఈ సందర్బంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ కు కృతజ్ఞతలని డిసిసి ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు.


*ముఖ్య విశేషాలు:*

- ప్రతి సంవత్సరం *"వైశాఖ శుక్ల పక్ష దశమి"* నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే వేడుకలను నిర్వహిస్తుంది.

- ఈ ఏడాది *ఏప్రిల్ 26న* రాష్ట్ర పండుగగా జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.

- అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీకి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తకి ఆర్యవైశ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర అధికారిక పండుగగా నిర్వహించడానికి రాష్ట్ర మాజీ మంత్రి షబ్బీర్ అలీ  కృషి ఎంతో ఉందని డీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post