[ఫోటో: కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామంటూ ఏప్రిల్ 25న జరగనున్న కార్యక్రమ పోస్టర్‌ను ప్రదర్శిస్తున్న నేతలు]
👉కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం
👉ఏప్రిల్ 25న హైదరాబాద్‌లో సభ
👉జాగృతిలో బాన్సువాడ నుంచి సీనియర్ పాత్రికేయుల చేరిక
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
"అమరుల ఆశయ సాధన కోసం, సామాజిక తెలంగాణ వికాసం కోసం కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం" అనే నినాదంతో ఈ నెల 25న హైదరాబాద్‌లో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ సభ జరుగుతున్నట్లు బాన్సువాడ నియోజకవర్గ బాధ్యులు మామిండ్ల రాజు, గూల సత్యనారాయణ, కిష్టపూర్ గంగాధర్ లు తెలిపారు. ఈ సభ కోసం నియోజకవర్గం నుంచి సుమారు 50 వాహనాల్లో ప్రజలను తరలించనున్నట్లు తెలిపారు. బాన్స్ వాడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ లో ఎవరు చేరినా సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
(పోస్టర్ ఆవిష్కరిస్తున్న వీడియో 👆)ఆ రోజు అమరుల ఆశయ సాధన, సంపూర్ణ తెలంగాణ వికాసం నినాదంతో కొత్త రాజకీయ వేదిక ఆవిష్కృతం అవుతుందని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి స్థానిక నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ కండువాలు ధరించిన పలువురు ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. "రండి కదిలి రండి.. సర్వోదయ తెలంగాణకై కలిసి నడుద్దాం" అనే నినాదంతో ప్రజలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పోస్టర్ ఆవిష్కరణలు, ప్రచారం చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమ వివరాలు:
ఏప్రిల్ 25, 2026 ఉదయం 8 గంటలకు మునీరాబాద్, మేడ్చల్, హైదరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం 6 వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.
(తెలంగాణ జాగృతి లో చేరుతున్న బాన్స్ వాడ నాయకుల వీడియో 👆)కవిత పార్టీలోకి సీనియర్ జర్నలిస్ట్ మామిండ్ల రాజు
సుమారు 32 సంవత్సరాలు జర్నలిస్ట్ గా సేవలందించిన బాన్స్ వాడ పట్టణానికి చెందిన మామిండ్ల రాజు ఇటీవల హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ను కలిశారు. సుమారు వంద మందితో కలిసి వెళ్లి ఆమె ప్రారంభిస్తున్న కొత్త పార్టీ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. అయనతో పాటు మరో పాత్రికేయుడు కిష్టపూర్ గంగాధర్ కు కవిత జాగృతి కండువాలు కప్పి ఆహ్వానించారు. 2001 లో కేసీఆర్ వెన్నంటి ఉండి నియోజకవర్గం లో టి ఆరెస్ అభివృద్ధికి, తెలంగాణ సాధన కు కృషి చేశానని, ప్రస్తుతం సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం కవిత వెంబడి నడుస్తానని మామిండ్ల రాజు విలేకరులతో పేర్కొన్నారు.



Post a Comment