[ఫోటో: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు. సమ్మె నేపథ్యంలో డిపోల వద్ద పోలీసు బందోబస్తు]
👉ఎక్కడి బస్సులు అక్కడే
👉నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె
👉ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
తెలంగాణ డైలీ న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో రవాణా రంగం స్తంభించింది. టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏప్రిల్ 22 (నేటి) నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు అర్ధరాత్రి నుంచి అన్ని డిపోల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగం, వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రయివేట్ వాహనాల్లో రెండింతల కిరాయి వసూలు చేస్తున్నారు. ఆర్టీసి రోజు వారి ఆదాయం కోల్పోయింది.
(సమ్మె వీడియోలు 👇)
సమ్మెకు కారణం:
ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, అది కేవలం 'కాలయాపన' చేసే చర్యేనని JAC నేతలు విమర్శించారు. పక్కా హామీ లభించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.
TGSRTC బస్సులు & సిబ్బంది సంఖ్య
బస్సుల సంఖ్య:
31-01-2026 నాటికి TGSRTC మొత్తం బస్సులు: 9,375
- RTC సొంత బస్సులు: 6,594
- అద్దె బస్సులు: 3,396
సిబ్బంది సంఖ్య:
TGSRTC ఉద్యోగులు: 38,419
ఇతర కీలక వివరాలు:
- డిపోలు: 97
- బస్ స్టేషన్లు: 364
- రూట్లు: 36,593
- రోజువారీ ప్రయాణికులు: 62.34 లక్షల మంది
- ఎలక్ట్రిక్ బస్సులు: ప్రస్తుతం 940 ఈ-బస్సులు ఆపరేషన్‌లో ఉన్నాయి
TGSRTC రోజువారీ ఆదాయం –
సగటు రోజువారీ ఆదాయం: రూ.21.05 కోట్లు
వివరాలు:
- Avg. Daily Earnings: రూ.2104.82 లక్షలు = రూ.21.04 కోట్లు/రోజు
- E.P.B (Earnings/Bus/Day): రూ.22,383/బస్సు/రోజు
- E.P.K (Earnings per KM): రూ.60.04/కి.మీ
- రోజువారీ కిలోమీటర్లు: 35.06 లక్షల కి.మీ
- రోజుకు ప్రయాణికులు: 62.34 లక్షల మంది
ఇతర ఆదాయ వివరాలు:
1. మహాలక్ష్మి పథకం తర్వాత: రోజుకు రూ.18-20 కోట్ల ఆదాయం వస్తోంది. అందులో మహాలక్ష్మి టికెట్ల ద్వారానే రూ.10-15 కోట్లు రోజువారీగా వస్తోంది
2. పండగ సీజన్‌లో: సంక్రాంతికి 5 రోజుల్లో టికెట్ల విక్రయం ద్వారా రూ.67.40 కోట్ల ఆదాయం వచ్చింది. స్పెషల్ సర్వీసుల ద్వారానే రోజుకు అదనంగా రూ.2.70 కోట్ల ఆదాయం వచ్చింది
3. మహాలక్ష్మి స్కీమ్ మొత్తం: డిసెంబర్ 9, 2023 నుంచి TGSRTCకి రూ.2,757 కోట్ల ఆదాయం వచ్చింది
4. వార్షిక ఆదాయం:
- 2023-24: రూ.6,708.10 కోట్లు
- H1FY25: రూ.4,027.85 కోట్లు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్నా, ప్రభుత్వం ఆ టికెట్ల ఖర్చును TGSRTCకి రీయింబర్స్ చేస్తోంది. దీంతో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 45.49 లక్షల నుంచి 59.10 లక్షలకు పెరిగింది.
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు:
నేటి ఉదయం మొదటి డ్యూటీ నుంచే బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వ స్పందన:
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందుకే అధికారుల కమిటీని నియమించామని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సమ్మె ప్రారంభం కావడంతో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం : బాన్స్ వాడ డిపో మేనేజర్
ఆర్టీసీ ఉద్యోగులు ఈరోజు విధుల్లో హాజరు కాలేదు. దీంతో అర్ధరాత్రి నుంచి బస్సు డిపో లోనే బస్సులు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణికులకు ఇబ్బందులు కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రైవేట్ బస్సులను ఆయారూట్లలో కొనసాగిస్తాం అవసరమైతే ప్రైవేటు కార్మికులను తీసుకొని బస్సులను నడిపిస్తాం












Post a Comment