Bakrid | బక్రీద్‌కు మున్సిపల్ ఏర్పాట్లు

బక్రీద్‌కు మున్సిపల్ ఏర్పాట్లు  

మైనార్టీలకు ఇబ్బంది లేకుండా చర్యలు: చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: బక్రీద్ సందర్భంగా మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.  

ఈద్గా వద్ద పనుల పరిశీలన  

పట్టణంలోని ప్రధాన ఈద్గా వద్ద జరుగుతున్న పనులను కౌన్సిలర్లు, అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు.  

ముస్లింలకు ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈద్గా పరిసరాల్లో పిచ్చిమొక్కలు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, పండుగ రోజంతా శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.  

మౌలిక వసతులపై దృష్టి  

ఈద్గాలకు వెళ్లే దారుల్లోని గుంతలు పూడ్చాలని, వీధి దీపాలను పునరుద్ధరించి వెలుతురు సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం తగిన తాగునీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. పండుగ రోజు భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు.  

ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ హనుమంత్ రావు, కౌన్సిలర్లు గ్యార అఖిల, వాజిద్, అంజాద్, జావీద్, అన్వర్, లడ్డు, నిట్టు గంగాధర్, కో-ఆప్షన్ మెంబర్ అలీబిన్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్యార సాయిలు, అమీర్, మున్సిపల్ అధికారులు, అమీర్, హైమద్ పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم