Top News

DYSO | క్రీడా కోటాలో విద్య, ఉద్యోగ అవకాశాలు: డీవైఎస్ఓ వెంకటేశ్వర్ గౌడ్

సమ్మర్ క్యాంప్‌తో క్రీడా నైపుణ్యాలు పెంచుకోవాలి 

క్రీడా కోటాలో విద్య, ఉద్యోగ అవకాశాలు: డీవైఎస్ఓ వెంకటేశ్వర్ గౌడ్

బాన్సువాడ మినీ స్టేడియంలో శిక్షణ శిబిరం పరిశీలన 

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని జిల్లా యువజన మరియు క్రీడా అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్ శనివారం ఉదయం సందర్శించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువ క్రీడాకారులు సమ్మర్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకుని తమ క్రీడా నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో 2 శాతం క్రీడా కోటా ద్వారా అవకాశాలు లభిస్తాయని తెలిపారు.  

ఇలాంటి శిక్షణా శిబిరాలు యువ క్రీడాకారుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో పాల్గొనాలని సూచించారు.  

ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ సురేందర్, క్రికెట్ కోచ్ నరేష్, యువ క్రీడాకారులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.




Post a Comment

أحدث أقدم