MLA Thota | పార్టీ బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

కామారెడ్డిలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, జిల్లా కార్యవర్గ సమావేశం  

పార్టీ బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు  

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా క్రిస్టల్ పాలస్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం  జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ  జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

కార్యకర్తలే పార్టీకి బలం: ఎమ్మెల్యే తోట  

ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి అయినా భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు సాధారణ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్త స్థాయి నుంచి నేడు రాష్ట్ర అధ్యక్ష స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు.  

ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలి  

పార్టీ పట్ల ప్రతి ఒక్కరూ గౌరవ భావంతో ఉండాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని నూతన సభ్యులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, భవిష్యత్తులో పార్టీ విజయాలకు కార్యకర్తలే బలమని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పార్టీకి మంచి పేరు తీసుకురావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.  

హాజరైన ప్రముఖులు  

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు  మొహమ్మద్ షబీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మునిసిపల్ చైర్మన్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






Post a Comment

أحدث أقدم