51 మంది లబ్ధిదారులకు రూ.14.43 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు చేతుల మీదుగా అందజేత
మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు వెల్లడి
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలోని 51 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.14,43,000 విలువైన చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు శుక్రవారం పంపిణీ చేశారు.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో వారు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
మండలాల వారీగా సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ గ్రామీణ మండలం 6 మందికి రూ.1,86,000, బాన్సువాడ మున్సిపాలిటీ ఇద్దరికి రూ.35,500, బీర్కూర్ మండలం నలుగురికి రూ.75,500, నసురుల్లాబాద్ మండలం 8 మందికి రూ.1,59,000, మోస్రా మండలం ఇద్దరికి రూ.28,000, చందూర్ మండలం నలుగురికి రూ.1,22,000, వర్ని మండలం ఐదుగురికి రూ.1,57,000, రుద్రూర్ మండలం నలుగురికి రూ.1,56,000, కోటగిరి మండలం ఆరుగురికి రూ.2,52,500, పోతంగల్ మండలం 9 మందికి రూ.2,54,000, ఇతరులు ఒక్కరికి రూ.17,000 చొప్పున మొత్తం 51 మందికి రూ.14,43,000 అందజేశారు.







Post a Comment