బాన్సువాడ రూరల్ సీఐ కార్యాలయ పనులను పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి
పట్టణ కేంద్రంలో నూతన భవన నిర్మాణం
వెంట సీఐలు తిరుపయ్య, శ్రీధర్, ప్రజాప్రతినిధులు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 14: బాన్సువాడ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
నిర్మాణ పనుల పురోగతిపై ఆరా
భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
హాజరైన అధికారులు, నాయకులు
ఈ సందర్భంగా బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బాన్సువాడ పట్టణ సీఐ శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఏజాస్, నార్ల సురేష్, అలీముద్దీన్ బాబా, ముజ్జు, గౌస్, ప్ర జాప్రతినిధులు, నాయకులు ఆయన వెంట ఉన్నారు.






Post a Comment