జిల్లా పద్మశాలి సర్వసభ్య సమావేశానికి తరలిన బాన్సువాడ నేతలు
కామారెడ్డి ఈఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో 'మనోహరం' సమావేశం
నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ , జూన్ 14: జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం ‘మనోహరం’కు బాన్సువాడ డివిజన్ పద్మశాలి సంఘం సభ్యులు భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు.
సంఘ బలోపేతంపై చర్చ
జిల్లా సమావేశంలో సంఘం బలోపేతం, సభ్యుల ఐక్యత, సభ్యుల సంక్షేమం, పేద విద్యార్థుల సంక్షేమం, పేద కుటుంబాలకు అండగా ఉండడం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన వంటి అంశాలపై చర్చించారు.
నూతన ప్రజాప్రతినిధులకు సన్మానం
ఇటీవల జిల్లాలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, సర్పంచులు, ఉపసర్పంచ్‌లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, ఇతర చైర్మన్ పదవుల్లో ఉన్న పద్మశాలి కుల సంఘం సభ్యులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.
హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, గూడ శ్రీనివాస్, చందుపట్ల నారాయణ, రామచందర్, నరహరి, బాలకృష్ణ, బాలరాజ్, లక్క శ్రీనివాస్, సుంకి శ్రీను, కౌన్సిలర్లు జంగం రాజు, మహేష్, శ్రీకాంత్, హోటల్ సాయిలు, గంగారం, పండరి, జంగం శ్రీను, అందె రాజు, సాదు సాయిలు, బీంరాజ్, జీవన్, యోగేష్, శ్రీధర్, రమణ, ఆంజనేయులు, గాజుల శ్రీనివాస్, రాజు, అనిల్ తదితర సంఘం సభ్యులు పాల్గొన్నారు.


Post a Comment