ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం
సుధాకర్ గౌడ్‌ను సత్కరించిన మున్సిపల్ కమిషనర్ జిన్న జగ్జీవన్
కలం సైనికుల సేవలు మరువలేనివి: కమిషనర్
బాన్సువాడ, జూన్ 14: బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్‌ను ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జిన్న జగ్జీవన్ ఘనంగా సన్మానించారు.
మరెన్నో పదవులు చేపట్టాలి: కమిషనర్
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని, ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు. సమాజంలో కలం సైనికుల సేవలు మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో బుడిమి మాజీ సర్పంచ్ లక్ష్మీనాం దేవ్, సొసైటీ డైరెక్టర్ నర్వ శంకర్, గ్రామస్తులు నాగాదర్, డాక్టర్ గోవింద్, జిన్న రవి, నర్వ నారాయణ, జిన్నా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment