Top News

Indiramma Sarees | బాన్సువాడలో ఇందిరమ్మ చీరల పంపిణీ

బాన్సువాడలో ఇందిరమ్మ చీరల పంపిణీ

ఎమ్మెల్యే పోచారం, కాసుల ఆదేశాల మేరకు పంపిణీ చేసిన కౌన్సిలర్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: పట్టణంలోని టీచర్స్ కాలనీ 13వ వార్డు పరిధిలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలను లబ్ధిదారులకు అందజేశారు.  

 బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు  పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు  ఆదేశాల మేరకు సోమవారం పాత మున్సిపల్ ఆఫీస్‌లో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.  

13వ వార్డు కౌన్సిలర్ ఖలేక్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Post a Comment

أحدث أقدم