లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షులుగా పాత బాలకృష్ణ ప్రమాణ స్వీకారం
సెక్రటరీగా ఖాలీద్, ట్రెజరర్‌గా విఠల్‌రెడ్డి ఎన్నిక
పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
లయన్స్ ఇంటర్నేషనల్ బాన్సువాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాత బాలకృష్ణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అదే విధంగా క్లబ్ నూతన సెక్రటరీగా ఖాలీద్, ట్రెజరర్‌గా విఠల్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. క్లబ్ పెద్దలు, సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి పదవీ బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పాత బాలకృష్ణ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి లయన్స్ క్లబ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
నూతన కార్యవర్గానికి పలువురు ప్రముఖులు, క్లబ్ సభ్యులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన నాయకత్వంలో క్లబ్ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు.



إرسال تعليق