Top News

Minister Ponnam Visit | నేడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

నేడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన 

ఎతొండలో రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రి

భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  బుధవారం నాడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  

మంత్రి పర్యటన షెడ్యూల్ వివరాలు:  

- ఉదయం 9.00 గంటలకు – కరీంనగర్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరతారు.  

- ఉదయం 10.30 గంటలకు– నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో స్వల్ప విరామం.  

- ఉదయం 11.30 గంటలకు– ఆర్మూర్ నుండి బయలుదేరతారు.  

- మధ్యాహ్నం 1.00 గంటలకు – నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎతొండ గ్రామానికి చేరుకొని రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు.  

-మధ్యాహ్నం 3.00 గంటలకు– కోటగిరి మండలం ఎతొండ గ్రామం నుండి బయలుదేరతారు.  

- సాయంత్రం 4.00 గంటలకు– కామారెడ్డి జిల్లా బాన్సువాడ చేరుకుని స్వల్ప విరామం.  

- సాయంత్రం 5.00 గంటలకు– బాన్సువాడ నుండి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మంత్రి నివాసానికి బయలుదేరతారు.  

- రాత్రి 8.30 గంటలకు – మంత్రి నివాసానికి చేరుకుంటారు.  

మంత్రి పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులు వసతి, రవాణా, ఎస్కార్ట్, భద్రతా బందోబస్తు ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Post a Comment

أحدث أقدم