Top News

MLA PSR | ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపు

పోచారం గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ  

_అధికారుల వద్ద ఓటరు వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి_  

_ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపు_  

_పారదర్శకంగా సవరణ పూర్తి చేయాలని సూచన_  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించారు.  

ఎమ్మెల్యే స్వయంగా హాజరు 

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని రెవెన్యూ అధికారుల వద్ద తన ఓటరు వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు.  






ఆర్డీఓ పర్యవేక్షణలో ప్రక్రియ  

ఆర్డీఓ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యుల ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారు.  

ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి: ఎమ్మెల్యే  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో పాల్గొనాలని కోరారు. అర్హులైన వారందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం 30 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రక్రియ అని గుర్తుచేశారు.  ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఏజాస్, సాయిరెడ్డి, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

--------------------------------

ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించండి: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  

_నేటి నుంచి 30 రోజుల పాటు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ_  

_బీఎల్ఓలు ఇంటింటికీ వస్తారని వెల్లడి_  

_రాజ్యాంగబద్ధ ప్రక్రియకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి_  

కామారెడ్డి, జూన్ 25: కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి _స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)_ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.  

బీఎల్ఓలు ఇంటింటికీ

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) ప్రతీ ఇంటికి వస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన వారి పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు ఈ ప్రక్రియలో చేపడతారన్నారు.  

అధికారులకు సహకరించాలి

ఓటరు జాబితా స్వచ్ఛత కోసం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కోరారు. బీఎల్ఓలు అడిగే వివరాలను సకాలంలో అందించి, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




Post a Comment

أحدث أقدم