బాన్సువాడలో ఈగిల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మత్తుమందు వ్యతిరేక ర్యాలీ
_పోలీస్, ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ మానవహారం_
_జూన్ 26 అంతర్జాతీయ మత్తుమందు నిరోధక దినోత్సవం సందర్భంగా అవగాహన_
_‘డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం’ అంటూ నినాదాలు_
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ : అంతర్జాతీయ మత్తుమందు దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలో ఈగిల్ ఫోర్స్ తెలంగాణ, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ, ఆసుపత్రి మీదుగా తాడ్కోల్ చౌరస్తా, డైయ్ మార్కెట్ వరకు సాగింది. (వీడియో 👇)
‘Say No to Drugs – Say Yes to Life’ బ్యానర్‌తో ప్రదర్శన
పోలీసు అధికారులు, విద్యార్థులు కలిసి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. “EAGLE FORCE TELANGANA – INTERNATIONAL DAY AGAINST DRUG ABUSE AND ILLICIT TRAFFICKING, JUNE 26” అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. “డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం”, “SAY NO TO DRUGS”, “SAY YES TO LIFE” అనే నినాదాలు పలికారు.
మత్తు వల్ల జీవితాలు నాశనం: సీఐ శ్రీధర్
ఈ సందర్భంగా బాన్సువాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వల్ల ఎన్నో విలువైన జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత మత్తుకు, డ్రగ్స్‌కు లొంగవద్దని సూచించారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి 1908 టోల్ ఫ్రీ నంబర్, 8712671111 వాట్సాప్ నంబర్‌కు వాట్సాప్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అసద్, అధ్యాపకులు,exise si,పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజలు, ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.





إرسال تعليق