Top News

SIR in Banswada | బాన్సువాడలో ఎస్ఐఆర్ డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభం

బాన్సువాడలో ఎస్ఐఆర్ డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభం  

అన్ని వార్డుల్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు, కౌన్సిలర్లతో ఇంటింటికీ ఫారాల పంపిణీ  

ఫోటో, డాక్యుమెంట్లపై ప్రజలకు అవగాహన  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 25: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డోర్ టు డోర్ కార్యక్రమం గురువారం బాన్సువాడ నియోజకవర్గంలో ప్రారంభమైంది. బాన్సువాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు.  

బూత్ నెంబర్ 221, 222 పరిధిలో బీఎల్ఓలు  వై.నవిత,  వనజకు సహాయంగా బూత్ లెవెల్ ఏజెంట్ ఎండీ మెయిన్, అలీం ఉద్దీన్ బాబా, 3వ వార్డు కౌన్సిలర్ హకీమ్, 4వ వార్డు కౌన్సిలర్ గైక్వాడ్ రుక్మిణి, ఇలియాస్, ఇక్బాల్, జబ్బర్ పాల్గొని ప్రతి ఇంటికి ఎస్ఐఆర్ ఫారాలను అందించారు.  

అదేవిధంగా బూత్ నెంబర్ 227, 228 పరిధిలో బీఎల్ఓలు వాణి, కపిల్ కు సహాయంగా 228 బీఎల్ఏ, 13వ వార్డు కౌన్సిలర్ ఖలేక్, 227 బీఎల్ఏ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ ఇంటింటికీ ఫారాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రవీందర్, బోడా భాస్కర్, ఎన్ఎస్‌యూఐ నాయకులు ఆర్ఫాత్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.  








రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు  పోచారం శ్రీనివాస్ రెడ్డి,  రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్  కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి  ఆదేశాల మేరకు బీఎల్ఏలు, కౌన్సిలర్లు బీఎల్ఓలకు సహకారం అందించారు.  

బృంద సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు సంబంధించిన ఫారాలను అందించడంతో పాటు ఫారం నింపడానికి అవసరమైన ఫోటో, ఆధార్ కార్డు, వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలు వంటి డాక్యుమెంట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు.  

ఓటరు జాబితాలో కొత్తగా పేర్ల నమోదు, తొలగింపులు, సవరణలకు ఈ ఫారం ఉపయోగపడుతుందని, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఎల్ఓలు సూచించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ జరుగుతుంది. అర్హులైన ఓటరు ఎవరూ మిగిలిపోకుండా చూసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post