Theft Case | నిజామాబాద్‌లో సాయిబాబా ఆలయంలో చోరీ యత్నం

నిజామాబాద్‌లో సాయిబాబా ఆలయంలో చోరీ యత్నం  

హర్యానాకు చెందిన ముగ్గురు దొంగల అరెస్ట్  

డయల్ 100కు సమాచారంతో పోలీసుల అప్రమత్తం

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్, జూన్ 15: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హర్యానా రాష్ట్రానికి చెందిన దోపిడీ ముఠా హల్ చల్ సృష్టించింది. అర్ధరాత్రి ఆలయంలో దోపిడీకి యత్నించారు.

మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హామాల్ వాడి ప్రాంతంలో గల సాయిబాబా ఆలయంలోకి ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు దోపిడీ దొంగలు ఆలయంలో హుండీతో పాటు ఇతర నగలను దొంగిలించేందుకు ప్రయత్నించారు.

తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డు, సుత్తితో ఆలయం దోర్లను ధ్వంసం చేస్తుండగా భారీగా శబ్దం రావడంతో ఆలయం చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవారు మేల్కొని వెంటనే డయల్ 100 కు సమాచారం అందించారు.

Post a Comment

Previous Post Next Post