Control Street Dogs | కుక్కలను నియంత్రించండి

కుక్కలను నియంత్రించండి  

మున్సిపల్ కమిషనర్‌కు బాగ్ వాన్ సంఘం వినతి

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని వెంటనే నియంత్రించాలని బాగ్ వాన్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్‌కు వినతి పత్రం సమర్పించారు.

సంఘం సభ్యులు మాట్లాడుతూ పట్టణంలోని 1వ వార్డు, 13, 14, 15 తదితర వార్డుల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 12 మందిని కుక్కలు కాటు వేయడంతో తీవ్ర గాయాలయ్యాయని, బాధిత పిల్లలు నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్నారని వివరించారు.

కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన సంఘం సభ్యులు, వెంటనే కుక్కలను పట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాగ్ వాన్ సంఘం సదర్ కాజీమ్, నాయబ్ సదర్ ఫజిల్, సజ్జాద్, సమీర్, ముబీన్, ఇమ్రాన్, మొన్నూ, హషం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم