శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో విషాదం
విహారానికి వచ్చి విగతజీవులుగా మారిన నలుగురు యువకులు
ముగ్గురి మృతదేహాలు లభ్యం - మరోకరి కోసం ముమ్మర గాలింపు
(తెలంగాణ డైలీ న్యూస్ - నిజామాబాద్ )
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. సరదాగా విహారయాత్రకు వచ్చిన నలుగురు యువకులు వరద కాలువలో జారిపడి గల్లంతయ్యారు.
ఘటన వివరాలు:
నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన కలీం (24), అమ్ము అలియాస్ సయ్యద్ వజహాత్ (24), అజీమ్ (24), ఖలీం, మహారాష్ట్ర బొకర్‌కు చెందిన ఆర్హాన్ (17) ఆదివారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. వరద కాలువ సమీపంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో పడిపోయి గల్లంతయ్యారు. ఘటన చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
(వీడియో 👇)
సహాయక చర్యలు:
సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, పోలీస్ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీపీ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు.
గల్లంతైన వారి కోసం పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టారు. నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురైనా బృందాలు నిరంతరం గాలింపు కొనసాగించాయి.
గాలింపులో గల్లంతైన నలుగురిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.
అధికారుల సమన్వయం:
ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ముప్కాల్ ఎస్‌ఐ సుహాసిని, ఇతర పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.
సీపీ సానుభూతి - ప్రజలకు విజ్ఞప్తి:
ఈ విషాద ఘటన పట్ల నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గల్లంతైన మరో వ్యక్తి కోసం అన్ని వనరులతో గాలింపు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో ప్రాజెక్టులు, బ్యాక్‌వాటర్ ప్రాంతాలు, వరద కాలువలు, చెరువులు, నదుల వద్ద సెల్ఫీలు దిగడం, ఈత కొట్టడం అత్యంత ప్రమాదకరమని, ముఖ్యంగా నీటి లోతు, ప్రవాహం తెలియని ప్రాంతాల్లోకి వెళ్లవద్దని నిజామాబాద్ పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండి పోలీసు మరియు సంబంధిత శాఖల సూచనలను పాటించాలని సూచించింది.
ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులలో, వారు నివసిస్తున్న కాలనీలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చేయి అందించిన స్నేహం... కానీ ప్రాణాలతో తిరిగి రాలేదు 💔
నిజామాబాద్ లో ఆదివారం జరిగిన ఒక్క ఘటన నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది.
స్నేహితులతో కలిసి శ్రీరామ్ సాగర్ లక్ష్మి కాలువ దగ్గరకు "కాసేపు సరదాగా" వెళ్లిన 4 గురు యువకులు... తిరిగి ఇంటికి రాలేకపోయారు.
ఏం జరిగింది?
నీటిలో ఒకరు కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయారు. "వాడిని కాపాడాలి" అని మరో ముగ్గురు కూడా నీటిలోకి దూకారు.
కానీ వరద నీటి ఉద్ధృతి వారిని కూడా లాక్కెళ్లిపోయింది.
ఎవరు వీళ్లు?
1. అర్హాన్ - 17 - మహారాష్ట్ర నుండి బంధువుల ఇంటికి వచ్చిన కుర్రాడు
2. వాజహాత్అలియాస్ అమ్ము - 24 - ఆటోనగర్ DCIM మెకానిక్. కుటుంబానికి ఆధారం
3. ఖలీం - 24 - అర్గాపల్లి భగత్ సింగ్ కాలనీ. వాహన మెకానిక్
4. అజీమ్ - 24 - ఇంకా ఆచూకీ లభించలేదు. NDRF, పోలీసులు, గజ ఈతగాళ్లు రాత్రంతా గాలిస్తున్నారు
ప్రాణం కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకున్న స్నేహం ఇది. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కూడా ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారు.
పోలీసుల విజ్ఞప్తి:
వర్షాకాలం... ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల దగ్గర సెల్ఫీలు, ఈతలు వద్దు. "ఒక్క నిమిషం" అనుకున్నదే జీవితాన్ని మార్చేస్తుంది.
కుటుంబానికి ఆధారంగా ఉన్న కొడుకులు ఇలా వెళ్లిపోవడంతో ఆటోనగర్, అర్గాపల్లి అంతా దుఃఖంలో మునిగిపోయింది.
స్నేహం కోసం ప్రాణం ఇచ్చిన ఆ 3 గురు యువకులకు జోహార్లు
గల్లంతైన అజీమ్ త్వరగా దొరకాలని కోరుకుందాం.








So sad to hear
ردحذفإرسال تعليق