Top News

Engagement Cancel | పోస్టర్ల కలకలం - తంగళ్లపల్లిలో ఆగిపోయిన యంగేజ్మెంట్


AI Image 

పోస్టర్ల కలకలం - తంగళ్లపల్లిలో ఆగిపోయిన యంగేజ్మెంట్  

7 ఏళ్లుగా ప్రేమిస్తున్నానంటూ ఫ్లెక్సీలు  

అర్ధరాత్రి ఏర్పాటు చేసిన యువకుడు - CCTV లో రికార్డ్  

సిద్దిపేట యువకుడిపై కేసు నమోదు

(దాస శ్రీనివాస్ - సిద్దిపేట బ్యూరో)

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో జరగాల్సిన ఓ యంగేజ్మెంట్ కార్యక్రమం పోస్టర్ల కలకలంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. సిద్దిపేటకు చెందిన ఓ యువకుడు 7 ఏళ్లుగా తాను ప్రేమిస్తున్నానంటూ తంగళ్లపల్లి పట్టణంలో పలుచోట్ల పోస్టర్లు, ఫ్లెక్సీలు అంటించాడు. 

అర్ధరాత్రి వచ్చి పోస్టర్లు అంటించాడు

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో వచ్చిన ఆ యువకుడు, యంగేజ్మెంట్ జరగాల్సిన ప్రాంతం చుట్టూ, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. "7 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను" అంటూ రాసి ఉన్న ఆ పోస్టర్లను చూసిన స్థానికులు ఉదయం ఒక్కసారిగా షాక్ అయ్యారు. సీసీ కెమెరాల్లో యువకుడు పోస్టర్లు అంటిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

యంగేజ్మెంట్ రద్దు - పోలీసులకు ఫిర్యాదు

ఈ ఘటనతో అమ్మాయి తల్లిదండ్రులు యంగేజ్మెంట్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అవమానంగా భావించిన వారు సిద్దిపేట పోలీస్ స్టేషన్‌లో సదరు యువకుడిపై ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. CCTV ఫుటేజీ ఆధారంగా యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు.

Post a Comment

أحدث أقدم