Top News

Engineer In Cheif Visit | అమృత్ పథక పనులను పరిశీలించిన ఇంజనీర్ ఇన్ చీఫ్

 


అమృత్ పథక పనులను పరిశీలించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ 

బాన్సువాడ పాత ఫిల్టర్ బెడ్ ఆధునీకరణకు కాసుల సూచనలు 

ప్రత్యామ్నాయ నీటి వనరుగా ఫిల్టర్ బెడ్ 

అమృత్ పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి 

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి భద్రత 

ఉన్నత అధికారుల నుంచి సానుకూల స్పందన

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

అమృత్ పథకం నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంగళవారం రాత్రి Engineer-in-Chief భాస్కర్ రెడ్డి, SE వెంకటేశ్వర్లు, EE తిరుపతి కుమార్, డిప్యూటీ EE నాగేశ్ రెడ్డిలు బాన్సువాడకు వచ్చారు. RDO రవీందర్ రెడ్డి వారిని పట్టణంలోని పురాతన ఫిల్టర్ బెడ్ వద్దకు తీసుకెళ్లి పరిస్థితులను వివరించారు. ఈ సందర్బంగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయాలు వస్తున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణానికి ప్రత్యామ్నాయంగా ఉన్న పాత ఫిల్టర్ బెడ్‌ను ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేయాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కోరారు. అమృత్ పథకం పనులను పరిశీలించేందుకు వచ్చిన ఉన్నతాధికారులకు ఆయన ఫిల్టర్ బెడ్ పరిస్థితిని వివరించారు.

ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ అమృత్ పథకం రాకముందు బాన్సువాడ ప్రజల తాగునీటి అవసరాలను ఈ ఫిల్టర్ బెడ్‌నే తీర్చిందన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీటి సరఫరాలో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాంటి సమయాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ఈ ఫిల్టర్ బెడ్ ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించేలా సిద్ధంగా ఉంచాలని అధికారులను కోరారు.

బాన్సువాడ పట్టణంలో రోజురోజుకు జనాభా పెరుగుతోందని, దానికి అనుగుణంగా తాగునీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే అమృత్ పథకం పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించాలని సూచించారు.

ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించిన అధికారులు అక్కడి సాంకేతిక అంశాలను గమనించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు అవసరమని, ఫిల్టర్ బెడ్ ఆధునీకరణతో బాన్సువాడకు మరింత భద్రమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని కాసుల బాలరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలో కౌన్సిలర్ ఖలేఖ్, జిల్లా యువజన అధ్యక్షులు మధుసుధన్ రెడ్డి, మన్సూర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم