Top News

Rice Millers |రైస్ మిల్లులపై దాడులకు నిరసనగా మహాధర్నాకు తరలిన బాన్సువాడ మిల్లర్లు

 

రైస్ మిల్లులపై దాడులకు నిరసనగా మహాధర్నాకు తరలిన బాన్సువాడ మిల్లర్లు

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద నేడు రైస్ మిల్లర్స్ ఆందోళన 

బాన్సువాడ డివిజన్ నుండి వందలాది మంది పాల్గొనేందుకు తరలింపు

బాన్సువాడ, సెప్టెంబర్ 10:రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగే రైస్ మిల్లర్స్ మహాధర్నాకు బాన్సువాడ డివిజన్ నుండి వందలాది మంది రైస్ మిల్ యాజమాన్యం, సిబ్బంది తరలివెళ్లారు.

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సెప్టెంబర్ 10న కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. మన హక్కుల కోసం - మన గళం, ఐక్యతే మన బలం అనే నినాదంతో ఈ ఆందోళన చేపట్టారు. Video👇


ఇందులో భాగంగా బాన్సువాడ డివిజన్ పరిధిలోని అన్ని రైస్ మిల్లులను మూసివేసి యాజమాన్యాలు, సిబ్బంది కలిసి వాహనాల్లో కామారెడ్డికి బయలుదేరారు. అనవసర తనిఖీలు, దాడులను ఆపాలని, మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగులగామ వెంకన్నతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.



Post a Comment

أحدث أقدم