ఇంటింటి సర్వేకు మరో 10 రోజులు
ఆగస్టు 10న ముసాయిదా జాబితా రిలీజ్
సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - SIR ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం 10 రోజులు పొడిగించింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఇంటింటి సర్వేను ఆగస్టు 3 వరకు కొనసాగించాలని ECI నిర్ణయించింది.
బూత్ లెవల్ అధికారులు జూన్ 25 నుంచి చేపట్టిన ఇంటింటి సర్వేను ఆగస్టు 3 వరకు పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ECI సవరించిన షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా అధికారికంగా ప్రచురిస్తారు. ఆ తర్వాత కొత్త ఓటర్ల నమోదు, పేర్లలో మార్పులు, తొలగింపులకు సంబంధించిన క్లెయిమ్స్ & అబ్జెక్షన్స్ స్వీకరించేందుకు నెల రోజుల సమయం ఇచ్చారు. ప్రజలు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు అధికారులు పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 12న విడుదల చేయనున్నారు.
పార్టీల విజ్ఞప్తితో ECI నిర్ణయం
రాష్ట్ర CEO సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం కలిసి SIR సక్రమంగా జరగాలని కోరింది. BRS కూడా కొన్ని చోట్ల ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని ఫిర్యాదు చేసింది.
దీంతో గతంలో జూలై 24తో ముగియాల్సిన SIR గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ ECI ఆదేశాలు జారీ చేసింది.

7815955645
ReplyDeletePost a Comment