స్పెల్-1 శిక్షణకు వివిధ కళాశాలల అధ్యాపకులు హాజరు
బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల కో-ఎడ్యుకేషన్ లో జిల్లా స్థాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్పెల్-1 ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా షేక్ సలాం మాట్లాడుతూ మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అధ్యాపకులు నిరంతరం తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు అధ్యాపకుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
ప్రతి అధ్యాపకుడు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుండి జువాలజీ, కామర్స్, హిందీ, తెలుగు అధ్యాపకులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

إرسال تعليق