Top News

Police Raid | జూదం స్థావరాలపై పోలీసుల దాడులు - ఏడుగురు అరెస్ట్

జూదం స్థావరాలపై పోలీసుల దాడులు - ఏడుగురు అరెస్ట్

లింగంపేట్, బీర్కూర్ పరిధిలో వేర్వేరు దాడులు

కామారెడ్డి: జిల్లాలో జూదం స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. లింగంపేట్, బీర్కూర్ ఎస్సైల ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్కపల్లి తండా అటవీ ప్రాంతంలో దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.4,410 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీర్కూర్ శివారులోని నల్లచెరువు కట్ట ప్రాంతంలో దాడి చేశారు. ఇక్కడ పేకాట ఆడుతున్న 3 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.860 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా పోలీసులు రూ.5,270 నగదు, 9 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

 జూదానికి దూరంగా ఉండాలని ఎస్పీ సూచన

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. 

జూదానికి బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, జూదం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. 

జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.




Post a Comment

أحدث أقدم