Top News

YLR Electronic Media | ఎల్లారెడ్డిలో ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం



 ఎల్లారెడ్డిలో ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

జర్నలిస్టుల బాధ్యతలు, నిబంధనలపై కీలక సూచనలు : TUWJ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ 

ఎల్లారెడ్డి, ఆగస్టు 27: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎల్లారెడ్డి పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ దొర వారి రాజరెడ్డి, TUWJ (IJU) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎల్లారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పి. రమేష్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.

ఈ సందర్భంగా TUWJ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ..

జర్నలిస్టుల బాధ్యతలు, నిబంధనలపై కీలక సూచనలు చేశారు. పోటీ ప్రపంచంలో వార్తలను వేగంగా అందించడం ఎంత ముఖ్యమో, అంతే బాధ్యతగా వ్యవహరించడం కూడా అవసరమని అన్నారు.

1.  వేగంతో పాటు నిజాయితీ ముఖ్యం: ఫాస్ట్ న్యూస్ ఇవ్వాలనే తొందరలో నిర్ధారణ లేని వార్తలు ఇవ్వవద్దు. ఒక తప్పుడు వార్త జర్నలిస్టు విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.

2.  AI పట్ల అప్రమత్తత: ప్రస్తుతం AI తో రూపొందించిన ఫేక్ ఫోటోలు, వీడియోలు, వాయిస్ లు విపరీతంగా వస్తున్నాయి. వాటిని గుడ్డిగా నమ్మి ప్రసారం చేయవద్దు. ఏ వార్త అయినా అధికారికంగా నిర్ధారించుకున్న తర్వాతే ప్రసారం చేయాలి.

3.  తప్పుడు వార్తలు వద్దు: వ్యూస్ కోసం సంచలనం సృష్టించేలా తప్పుడు కథనాలు, తప్పుదోవ పట్టించే శీర్షికలు పెట్టవద్దు. జర్నలిజం ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికే తప్ప, భయాందోళన సృష్టించడానికి కాదు.

4.  ఎథిక్స్ పాటించాలి: ప్రెస్ కౌన్సిల్ నిబంధనలు, ఎలక్ట్రానిక్ మీడియా నియమావళిని ప్రతి జర్నలిస్టు తప్పనిసరిగా పాటించాలి. వ్యక్తిగత దూషణలు, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ కు దూరంగా ఉండాలి.

జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందని, అక్రిడిటేషన్, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సీఐ దొర వారి రాజరెడ్డి మాట్లాడుతూ.. క్రైమ్ వార్తల కవరేజీలో జర్నలిస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా అత్యాచారం, లైంగిక వేధింపులకు గురైన బాలిక లేదా మహిళ పేరు, ఫోటో, ఊరు, ఇంటి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయకూడదని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని, చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వార్తలు ఇవ్వవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ గౌడ్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మోహియొద్దీన్, చంద్రశేఖర్, యూనియన్ బాధ్యులు శ్రీకాంత్, సురేష్, రాజు, ముకర్రం, యశ్వంత్ రావు, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, పోషీరామ్, మోసిన్, శ్రీధర్, మె హెరాజ్, న్యాయవాది పండరి, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.





ఎల్లారెడ్డి నియోజకవర్గం 
ఎలక్ట్రానిక్ మీడియా –నూతన కార్యవర్గం

అధ్యక్షుడు: పిన్నూరి రమేశ్

ఉపాధ్యక్షుడు: మహేష్ కుసలకంటి

ప్రధాన కార్యదర్శి: పవార్ యశ్వంత్

కోశాధికారి: రాచర్ల సంతోష్

కార్యదర్శి: జంగం శంభులింగం

అధికార ప్రతినిధి: మస్త్యాల శ్రీధర్

సహాయ కార్యదర్శి: బన్సిలాల్

ఆర్గనైజింగ్ సెక్రటరీ: సాయిరాం గౌడ్

మీడియా సలహాదారు: సాయి కుమార్ సోమయాజుల

కార్యవర్గ సభ్యుడు: అనిల్ నాయక్

మీడియా సలహాదరులు 
మాధవరావు, (మధు )

లీగల్ అడ్వైజర్: గోపాల్ రావు, అడ్వకేట్

సలహాదారులు: ముక్రం, బొల్లారం సీను, ఎం. రాజు, పోషన్న, ఎండీ గౌస్ 



Post a Comment

أحدث أقدم