Top News

Best Teacher in Qatar | బాన్సువాడ టీచర్ కు దోహాలో అరుదైన గౌరవం

బాన్సువాడ టీచర్ కు దోహాలో అరుదైన గౌరవం - 'ఆదర్శ ఉపాధ్యాయుడి'గా  సాలెం బిన్ ఈసా

భారత రాయబారి చేతుల మీదుగా సన్మానం

బాన్సువాడ / దోహా: తెలంగాణ గడ్డపై పుట్టి, ఖతార్ గడ్డపై తెలుగు వెలుగును చాటిన బాన్సువాడకు చెందిన ఉపాధ్యాయుడు సాలెం బిన్ ఈసా కు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది.

ఖతార్ లోని ప్రతిష్టాత్మక ఐడియల్ ఇండియన్ స్కూల్, దోహాలో నిర్వహించిన వార్షిక తహనీయతి మజ్లిస్ లో ఆయనకు 'మిసాలీ ఉస్తాద్ - ఆదర్శ ఉపాధ్యాయ' అవార్డును ప్రదానం చేశారు.

ఖతార్ లోని 12 ప్రముఖ ఇండియన్ స్కూళ్ల నుండి ఒకే ఒక్క ఉత్తమ ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి ఈ అవార్డు ఇస్తారు. ఈ ఏడాది ఆ అదృష్టం బాన్సువాడకు చెందిన సాలెం బిన్ ఈసా గారికి దక్కింది.

భారత రాయబారి చేతుల మీదుగా సన్మానం:

దోహాలోని భారత రాయబార కార్యాలయం తరపున భారత రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి, ప్రథమ కార్యదర్శి హర్షీ పాండే చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. ఆయన బోధనా నైపుణ్యం, విద్యార్థులను తీర్చిదిద్దడంలో చూపిన అంకితభావానికి గాను ఈ గుర్తింపు లభించింది.

ఈ ఘనత బాన్సువాడకే గర్వకారణమని, ఆయన మన ప్రాంతానికి చెందిన వాడు కావడం మనందరికీ గర్వకారణమని స్థానిక విద్యావేత్తలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దోహాలో భారత రాయబారి డా. కె. శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఆదర్శ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటున్న బాన్సువాడకు చెందిన సాలెం బిన్ ఈసా👆




Post a Comment

أحدث أقدم