బాన్సువాడలో గణేష్ మండలి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు
టీచర్స్ కాలనీ సిద్ధి వినాయక, దుర్గ భవానీ గణేష్ మండళ్ల ఆధ్వర్యంలో ఘనంగా పూజలు
కాసుల బాలరాజు, శివదయాల్ వర్మ, మున్సిపల్ కౌన్సిలర్లకు శాలువాలతో ఘన సన్మానం
బాన్సువాడ, సెప్టెంబర్ 21: బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక గణేష్ మండలి మరియు దుర్గ భవానీ గణేష్ మండలి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, శివదయాల్ వర్మ, బోడ భాస్కర్, బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ మహ్మద్ ఖాలిక్, బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిద్ధి వినాయక గణేష్ మండలి సభ్యులు ముఖ్య అతిథులను శాలువా మరియు బహుమతులతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో త్రిమూర్తి శ్రీనివాస్, రుద్రంగి ప్రసాద్, సింధు స్కూల్ జ్ఞానేశ్వర్, మెడికల్ పవన్, టీచర్ శ్రీనివాస్ సార్, సతీష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.



إرسال تعليق