Top News

life Imprisonment | బంగారం కోసం మహిళ హత్య - నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

బంగారం కోసం మహిళ హత్య - నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

నవీపేట్ హత్య కేసులో న్యాయం - దోషికి జీవిత ఖైదు, రూ.7 వేల జరిమానా

నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను అభినందించిన సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, సెప్టెంబర్ 21: బంగారు ఆభరణాల కోసం మహిళను గొంతు నులిమి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ నిజామాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25-11-2025న నమోదైన హత్య కేసులో IV అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి (ఫ్యామిలీ & ఉమెన్స్ కోర్టు) గౌరవ న్యాయమూర్తి శ్రీ డి. దుర్గ ప్రసాద్  నేడు బహిరంగ న్యాయస్థానంలో తీర్పు వెలువరించారు.

కేసు వివరాల ప్రకారం - నిందితుడు కుమురం @ పాండవాల సాగర్ (37), తండ్రి పాండవాల పోశెట్టి, వృత్తి కూలీ, మోస్రా మండల కేంద్రం.  మృతురాలు ఆకుల అనంత @ సోనీ (29), మల్కాపూర్ గ్రామం, నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన గృహిణి. నిందితుడు మృతురాలికి బంధువు కావడంతో ఆమె ఇంటికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను గమనించి దొంగిలించాలనే దురుద్దేశంతో, ఆమె తల్లి ఇంట్లో లేని సమయం చూసి ఇంటికి వచ్చి గొంతు నులిమి హత్య చేసి ఆభరణాలను అపహరించాడు.

ఈ కేసులో నవీపేట్ పోలీస్ స్టేషన్ Crime No. 307/2025, SC No. 130/2026, BNS సెక్షన్లు 103(1), 303(2) కింద కేసు నమోదు చేశారు. CIP నార్త్ రూరల్ నిజామాబాద్ శ్రీ బి. శ్రీనివాస్ గారు నవీపేట్ పోలీస్ సిబ్బంది సహాయంతో ఆధారాలను శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున Addl. Public Prosecutor శ్రీమతి ఎం. నీరజ వాదించారు.

ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.

విధించిన శిక్ష:

BNS సెక్షన్ 103(1) కింద జీవిత ఖైదు మరియు రూ. 5,000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో 6 నెలల జైలు శిక్ష.

BNS సెక్షన్ 303(2) కింద 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 2,000 జరిమానా, చెల్లించని పక్షంలో 6 నెలల జైలు శిక్ష. రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి.

ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన CIP నార్త్ రూరల్ బి. శ్రీనివాస్, SI నవీపేట్ సి. తిరుపతి, కోర్టు లైజన్ ఆఫీసర్ T. గోవింద్, CMS/CDO సిబ్బంది K. చంద్రశేఖర్ PC-1824, K. గణేష్ PC-2535, నవీపేట్ CDO M. సుప్రియ WPC-3117, రైటర్లు ఆర్. శ్రీకాంత్ గౌడ్ PC-967, దత్తాద్రి గౌడ్ PC-2148, సిహెచ్ నాగరాజు PC-2990లను నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య IPS అభినందించారు.

నేరాలకు పాల్పడే వారికి చట్టపరమైన పరిణామాలు తప్పవని, బాధితులకు న్యాయం జరిగేలా నిజామాబాద్ పోలీస్ శాఖ సమర్థవంతమైన దర్యాప్తుకు ప్రాధాన్యత ఇస్తుందని సీపీ తెలిపారు.

Post a Comment

أحدث أقدم