బాన్సువాడలో జాతీయ ఐక్యతా సదస్సు - సెప్టెంబర్ 27న నిర్వహణ
ఆహ్వాన పత్రికలు అందజేసిన ముఫ్తీ ఉమర్ బృందం
బాన్సువాడ, సెప్టెంబర్ 23: జాతీయ ఐక్యత, పరస్పర సహనాన్ని చాటేలా బాన్సువాడలో బృహత్తర జాతీయ ఐక్యతా సదస్సును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ (ర.అ) ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ మతాలు, వర్గాలకు చెందిన మత, రాజకీయ, సామాజిక ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఫ్తీ ఉమర్, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ముహమ్మద్ ఇజాజ్, 3వ వార్డు కౌన్సిలర్ యేం ఏ హకీమ్, వార్డు కౌన్సిలర్ జంగం రాజు, మాజీ కో-ఆప్షన్ మొయిన్, బుల్లెట్ రాజు, మహమ్మద్ ఇక్బాల్ తదితరులతో కలిసి అందజేశారు.
వేదిక: మార్కెట్ యార్డ్ గంజ్, బాన్సువాడ
తేదీ: 27 సెప్టెంబర్ 2026, ఆదివారం
సమయం: సాయంత్రం 7 గంటలకు
ఈ సదస్సులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.


إرسال تعليق