National Integration Day | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

సెప్టెంబర్ 17కు సమైక్యత స్ఫూర్తిని చాటిన కేసీఆర్

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచనల మేరకు జెండా ఆవిష్కరణ

బాన్సువాడ, సెప్టెంబర్ 17: బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచనల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రత్యేకతను గుర్తిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజును తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా అధికారికంగా నిర్వహించింది. 2022లో 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది.

నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రజల్లో జాతీయ సమైక్యత, సోదరభావం, తెలంగాణ చరిత్రపై అవగాహన పెంపొందించేలా కేసీఆర్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది.

సెప్టెంబర్ 17ను రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజల ఐక్యతకు ప్రతీకగా గుర్తుచేసుకోవాలని, చరిత్రను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలపాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్వహించిన కార్యక్రమాలు చాటిచెప్పాయి. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ఒక ముఖ్యమైన రోజు అని, ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సమైక్యతా స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమాల ద్వారా సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి, మోరల్ శ్రీనివాస్, బోడ రాంచందర్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మోచి గణేష్, ఇసాక్, అందె రాజు, మొగులన్న, కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, ఖలీల్ ఖాన్, మక్బూల్, షఫీ, అతీఫ్, గంగారాం, అఫ్జల్, సమీర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم