తరగతి గది నుండి 30 ఏళ్ల ప్రయాణం... మళ్లీ అదే బెంచీల వద్ద!
బాన్సువాడలో అరుదైన దృశ్యం - 1996-97 SSC బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం
రుద్రంగి అశోక్/బాన్సువాడ:
చదువుకున్న పాఠశాల... అదే తరగతి గది... 30 ఏళ్ల క్రితం కొట్టుకున్న బెంచీలు... కానీ ఇప్పుడు జుట్టుకు తెల్ల వెంట్రుకలు, నుదుట ముడతలు. ఇదే బాన్సువాడ శ్రీనివాస ట్యుటోరియల్ స్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయికలో కనిపించిన ఆసక్తికర దృశ్యం.
ఒకప్పుడు హోంవర్క్ చేయలేదని బెత్తంతో కొట్టిన గురువులే... ఇప్పుడు అదే విద్యార్థులు తమ గురువుల పాదాలకు నమస్కరించి శాలువా కప్పి సత్కరించారు. కళ్లల్లో ఆనందభాష్పాలు.
ఈ ఆత్మీయ సమ్మేళనం లో హైలైట్ లు:
- 30 ఏళ్ల క్రితం కలిసి చదివిన స్నేహితులు - నరేష్, కాంగ్రెస్ నేత, మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ గౌస్, సుధాకర్, శ్రీరామ్, శంకర్ ముందుండి ఈ వేడుకను ఏర్పాటు చేశారు.
- తమతో చదివి మరణించిన మిత్రుల ఫోటోలకు నివాళులు అర్పించి మౌనం పాటించిన విద్యార్థులు.
- బాలిక నాట్య ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభం.
- అప్పటి గురువులు - నర్సింగ్ రావు సార్, షేక్ సలాం, పోచయ్య సార్, పుష్పలత మేడమ్, సత్యనారాయణ సార్, శ్రీనివాస్ రెడ్డి సార్, సాయి రెడ్డి సార్, రుక్మా రెడ్డి సార్, విఠల్ సార్, నర్సింలు సార్, సుధీర్ సార్, శుభద మేడమ్, రాజేశ్వర్ సార్, బస్వరాజ్ సార్, వీరకుమార్ సార్, గుండయ్య సార్, సత్యవతి మేడమ్ లకు ఘన సన్మానం.
గురువుల మాటల్లో... "మీరు మమ్మల్ని మర్చిపోలేదు, ఇదే మాకు గురుదక్షిణ" అంటూ ఉపాధ్యాయులు భావోద్వేగానికి గురయ్యారు.
చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు మళ్లీ ఒకే వేదికపైకి రావడం బాన్సువాడలో చర్చనీయాంశంగా మారింది.




إرسال تعليق