వరికి చివరి దశలో నీరు అవసరమైన వేళ వర్షం - రైతుల్లో హర్షం
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు - వాతావరణ శాఖ హెచ్చరిక
బాన్సువాడ, 18 అక్టోబర్: ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం ఊరటనిచ్చింది. బాన్సువాడలో సుమారు అరగంట పాటు వర్షం కురిసింది. ప్రస్తుతం వరికి చివరి దశలో నీరు అవసరం ఉండగా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా ఆదివారం, సోమవారం (18, 19 తేదీలలో) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.



إرسال تعليق