అంబేద్కర్ విగ్రహ స్థాపనకు మంత్రి వివేక్ వెంకటస్వామి విరాళం - రూ.50 వేల చెక్కు అందజేత
పిట్లం, అక్టోబర్ 6: పిట్లం మండలం సిద్దాపూర్ గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపనకు రాష్ట్ర బొగ్గు, ఉపాధి, శిక్షణ, పారిశ్రామిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రూ.50,000 విరాళం అందించారు.
మంత్రి ఇచ్చిన చెక్కును దళిత నాయకుడు, సామాజిక కార్యకర్త అయ్యల సంతోష్ సోమవారం గ్రామస్తులకు అందజేశారు.
ఈ సందర్భంగా అయ్యల సంతోష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను, తండ్రి మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి నిరంతరం అంకితభావంతో పని చేస్తున్నారని అన్నారు.
విరాళం అందించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి సిద్దాపూర్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత దవులయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పోచయ్య, మిద్దింటి సాయిలు, రాములు, రమేష్, భూతలే హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق