Congress Leaders | అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు 

అఫ్జల్ ఖాన్ ఘటనను ఎంపీ సురేష్ శెట్కార్ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేతలు - మృతదేహం తెప్పించేందుకు కృషి

బాన్సువాడ, అక్టోబర్ 13: రష్యాలో బలవంతంగా ఆర్మీలో చేర్చబడి మృతి చెందాడని సమాచారం వచ్చిన ఎండి అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని మంగళవారం టీజీ ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పరామర్శించింది.

వివరాల్లోకి వెళ్తే...  మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్జల్ ఖాన్ గత ఫిబ్రవరి నెలలో వర్క్ వీసాపై రష్యాకు వెళ్లాడు. అక్కడ అతనితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ముగ్గురిని రష్యా అధికారులు బలవంతంగా ఆర్మీలో చేర్పించారు.

అయితే 10 రోజుల క్రితం అతనితో పాటు ఉన్న అశోక్ అనే వ్యక్తి తన భార్యకు వాయిస్ మెసేజ్ ద్వారా అఫ్జల్ ఖాన్ చనిపోయాడని చెప్పడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో బాధిత కుటుంబం ఇండియన్ ఎంబసీ, జిల్లా ఎస్పీ, ఎంపీలను ఆశ్రయించింది. అయినా అతని అధికారిక సమాచారం ఏదీ దొరకడం లేదు. బతికి ఉన్నాడా లేదా అనేది కేవలం వాయిస్ మెసేజ్ ద్వారానే తెలుస్తోందని, దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని కుటుంబీకులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కాసుల బాలరాజ్ బాధితుడి తండ్రి అబ్బాస్ ఖాన్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. వెంటనే జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలియజేశారు. అఫ్జల్ ఖాన్ క్షేమ సమాచారాన్ని రష్యా దౌత్య కార్యాలయం ద్వారా తెలుసుకోవాలని కోరారు.

దీనికి స్పందించిన ఎంపీ సురేష్ షెట్కార్ తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని, వెంటనే ఇండియన్ ఎంబసీకి వెళ్లి అఫ్జల్ ఖాన్ సమాచారం తెలుసుకుంటానని, ఒకవేళ మృతి చెంది ఉంటే మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని కాసుల బాలరాజ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అలీబిన్ అబ్దుల్లా, ఏజాజ్, ఖాలీద్, వహాబ్, తాడ్కల్ సర్పంచ్ రమేష్ గోపాల్ రెడ్డి, బాబా,  గౌస్ కో ఆప్షన్, మోయిన్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు. వీడియో 👇



Post a Comment

أحدث أقدم