DCSO Suspend | రైస్ మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం - నిజామాబాద్ డీసీఎస్ఓ సస్పెండ్

రైస్ మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం - నిజామాబాద్ డీసీఎస్ఓ సస్పెండ్

నెలవారీ రైస్ మిల్లుల తనిఖీల్లో అలసత్వం, సీఎంఆర్ వ్యవహారంలో చర్యలు

విధుల నిర్వహణలో నిర్లక్ష్యంతో డీసీఎస్ఓ   పై వేటు

నిజామాబాద్, అక్టోబర్ 31: నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖలో అవినీతి, నిర్లక్ష్యంపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రైస్ మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం వహించారంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్ఓ) ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే, గత కొన్ని రోజులుగా జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

  జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టగా, అనేక మిల్లుల్లో లెక్కల్లో తేడాలు, నిబంధనల ఉల్లంఘన బయటపడింది. ఆరు రైస్ మిలర్ల పై కేసులు నమోదు చేశారు. సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ తనిఖీలు సక్రమంగా నిర్వహించకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే ఈ అక్రమాలకు కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు.  ఈ నేపథ్యంలో నిజామాబాద్ పౌరసరఫరాల శాఖ అధికారిపై చర్యలు తీసుకున్నారు. సీఎంఆర్ వ్యవహారంలో నిర్లక్ష్యంపై చర్చలు జరిపిన అనంతరం డీసీఎస్ఓను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

పౌరసరఫరాల శాఖలో పారదర్శకత కోసం ఈ చర్యలు తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم