DSP | హోంగార్డ్ కుమారుడిని సన్మానించిన డీఎస్పీ

హోంగార్డ్ కుమారుడిని సన్మానించిన డీఎస్పీ

నీట్‌లో ర్యాంక్ సాధించి సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీటు పొందిన ప్రవీణ్

బాన్సువాడ, 15 అక్టోబర్: బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తున్న విశ్వనాథ్ కుమారుడు బి. ప్రవీణ్ కుమార్ ను డీఎస్పీ విఠల్ రెడ్డి గురువారం ఘనంగా సన్మానించారు.

ప్రవీణ్ కుమార్ నీట్ లో 2 లక్షల ర్యాంకు సాధించి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాడు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో శాలువా కప్పి, మిఠాయిలు తినిపించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ తిరుపయ్య,  ఎస్సై వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم