బాన్సువాడలో భారీ కొండ చిలువ కలకలం
బాన్సువాడ, అక్టోబర్ 13: బాన్సువాడ పట్టణ శివారు తాడ్కోల్ లోని పీఎస్ఆర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీకి వెళ్లే రోడ్డుపై శివాజీ విగ్రహం టర్నింగ్ వద్ద హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది.
సుమారు 8-10 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ రోడ్డు దాటుతుండటాన్ని గమనించిన వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాహనాల రాకపోకలతో అది తిరిగి పొలాల్లోకి వెళ్లిపోయింది.
ఇది ఇండియన్ రాక్ పైథాన్ (Python molurus) జాతికి చెందినదిగా గుర్తించారు. ఇది విషం లేని పాము, తన ఆహారాన్ని చుట్టుకుని చంపుతుంది. సాధారణంగా మనుషులపై దాడి చేయదు.
అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ, ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షిత జాతి అని, దీన్ని చంపడం నేరమని తెలిపారు. కొండచిలువ కనిపిస్తే దూరంగా ఉండి అటవీ శాఖ లేదా స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. (వీడియో 👇)

إرسال تعليق