Missing Man's Deadbody | బీర్కూర్ లో విషాదం

బీర్కూర్ లో విషాదం: వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు !

బీర్కూర్, అక్టోబర్ 3: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన టేకు సాయిలు (40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

గత వారం రోజుల నుండి సాయిలు ఇంటి నుండి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

ఈ క్రమంలో శనివారం బీర్కూర్ లోని బాజన్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం తేలుతున్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడిని ఇందిరా కాలనీకి చెందిన టేకు సాయిలుగా కుటుంబ సభ్యులు గుర్తించారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم