Police Raid | బాన్సువాడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - 9 మంది అరెస్ట్

బాన్సువాడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - 9 మంది అరెస్ట్

మొగులానిపల్లి అటవీ ప్రాంతంలో బహిరంగంగా జూదం - రూ.18,630 నగదు సీజ్

8 సెల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం - కేసు నమోదు చేసిన పోలీసులు

బాన్సువాడ, 19 అక్టోబర్: బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగులానిపల్లి శివారు అటవీ ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారన్న రహస్య సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.18,630 నగదు, 8 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బాన్సువాడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుల శ్రీధర్ తెలిపారు.

Advertisement 


Post a Comment

أحدث أقدم