బాన్సువాడ నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి
తన స్వగ్రామం పోచారంతో పాటు కల్లూరు, జలాల్‌పూర్, బాన్సువాడలో సందడి
సతీమణి పుష్పతో కలిసి ఆడబిడ్డలతో బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే
కామారెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఉత్తమ బతుకమ్మలకు కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు
బాన్సువాడ, 17 అక్టోబర్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
తన స్వగ్రామమైన పోచారంతో పాటు పోతంగల్ మండలం కల్లూరు, వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామాల్లో, బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ, సరస్వతి మందిరం ఫంక్షన్ హాల్, కల్కి చెరువు కట్టపై తన సతీమణి పుష్పతో కలిసి ఆడబిడ్డలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.
--------------------------------
కామారెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నాలుగు రోజుల పాటు వివిధ శాఖల మహిళా ఉద్యోగుల బతుకమ్మ ఆటలు
ఉత్తమ బతుకమ్మలకు కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు
కామారెడ్డి, 17 అక్టోబర్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు వివిధ శాఖల మహిళా ఉద్యోగులు ప్రతిరోజూ బతుకమ్మ ఆడారు.
DRDA, వైద్య ఆరోగ్య శాఖ, ట్రెజరీ శాఖలు పెద్ద ఎత్తున బతుకమ్మలు తీసుకొచ్చి ఆడగా, IKP మహిళా సమాఖ్య సభ్యులు ఆకర్షణీయంగా బతుకమ్మలను తయారు చేసి పాల్గొన్నారు. 15 అక్టోబర్ న లింగంపేట మండలం నాగన్న బావి వద్ద కూడా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ హాజరు కాగా, అదనపు కలెక్టర్ గిరి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, టూరిజం అధికారి వెంకట్ గౌడ్, డీఆర్డీఓ దామోదర్, అదనపు డీఆర్డీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు రోజులుగా ప్రదర్శించిన బతుకమ్మలలో ఉత్తమ బతుకమ్మలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. మొదటి బహుమతి ట్రెజరీ శాఖకు, రెండో బహుమతి ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ శాఖకు, మూడో బహుమతి మెప్మాకు, కన్సోలేషన్ బహుమతులు పంచాయతీ కార్యాలయం, DRDAలకు ఇచ్చారు. మండల సమాఖ్యల్లో బిక్నూర్ కు మొదటి, దోమకొండకు రెండో, బీబీపేటకు మూడో బహుమతి ప్రదానం చేశారు.









إرسال تعليق