బాన్సువాడ టీచర్స్ కాలనీలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు
పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు పోచారం
బాన్సువాడ, అక్టోబర్ 15: బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి జరిగిన దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఖాలేక్, సీనియర్ నాయకులు ఏరువల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, నార్ల సురేష్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు సుల్తానా గౌస్, దాసరి శీను, రవీందర్ సేటు, గోపాల్ రెడ్డి, బోడ భాస్కర్ తో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే పోచారం ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను కాలనీవాసులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు.






إرسال تعليق