ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం - RDO కి వినతిపత్రం
బాన్సువాడ, అక్టోబర్ 14 (బుధవారం): ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన చేపట్టనున్న శాంతియుత నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ మాల సంఘం నాయకులు బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ అమలులో మాల విద్యార్థులకు, ఉద్యోగులకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి నిరసనగా ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు శాంతియుత నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు మాలలు, నాయకులు, సభ్యులు అందరూ హాజరై సంఘీభావం తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లూరి సాయిలు, కార్యదర్శి దొనకంటి బ్రహ్మం, గైని ప్రవీణ్ కుమార్, మేకల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق