Self Employement | మహిళలకు స్వయం ఉపాధి బాటలు!

మహిళలకు స్వయం ఉపాధి బాటలు! 

నసురుల్లాబాద్‌లో కెనరా బ్యాంకు సహకారంతో వృత్తి నైపుణ్య శిక్షణ

ఇప్పటికే 250 మంది మహిళలకు శిక్షణ - ఉచిత భోజన, వసతి సౌకర్యం

నసురుల్లాబాద్, అక్టోబర్ 15: మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకునే లక్ష్యంతో నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కొనసాగుతున్నాయి.

కెనరా బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు వివిధ రకాల వృత్తుల్లో శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణా కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, అక్కడ భవనాలు అందుబాటులో లేకపోవడంతో నసురుల్లాబాద్‌లోని గిరిజన బాలుర వసతి గృహంలో నిర్వహిస్తున్నారు. Video 👇


ఇప్పటికే సుమారు 250 మంది మహిళలు వివిధ రకాల శిక్షణలు పొందారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, అగరవత్తుల తయారీ, పుట్టగొడుగుల తయారీతో పాటు పురుషులకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ఎలక్ట్రీషియన్ శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

నెల రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో పాల్గొంటున్న మహిళలకు ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పించారు. శిక్షణ పొందిన వారికి వ్యాపార స్థాపన, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ వంటి అంశాల్లో కూడా కెనరా బ్యాంకు మార్గదర్శకత్వం అందిస్తోంది.

మహిళల ఆసక్తిని బట్టి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.







Post a Comment

أحدث أقدم